Wednesday, 27 September 2017

BSNL Recruitment 2017 for JAO (Junior Accounts Officer) for 996 Posts – How to Apply - జేఏఓ పోస్టుల ఆహ్వానం - SEE FULL DETAILS HERE



BSNL, the Bharat Sanchar Nigam Limited gave the recruitment (BSNL recruitment 2017) notification for 996 posts of Junior Accounts Officers through online competitive examinations 2017.

BSNL Recruitment 2017 for JAO (Junior Accounts Officer) for 996 Posts – How to Apply

In BSNL, the registration process for the candidate of “Direct Junior Accounts Officers (DR-JAO)” will have from September 11 through online BSNL portal – www.externalexam.bsnl.co.in.

As many as 996 posts of Direct JAOs, the state run telecom firm will recruit who will have appointed in the IDA pay scale Executive [E-1] of Rs 40,500 with an annual increment of 3% of basic pay plus IDA, HRA, perks, medical benefits, etc. as per the company rules.

Eligibility for the exam:

From a recognised institution/University, the applicant must possess the educational qualification M.COM/CA/ICWA/CS. And the person who appears for the exam should be below 20 years. And shall not have exceeded 30 years as on January 1, 2017.

Anyway, as per the standing instructions of Government of India: 5 years for SC/ST candidates, 3 years for OBC candidates, and 15 years for SC/ST-PWD candidates, 13 years for OBC-PWD candidates, 10 years for OC-PWD candidates and 5 years for BSNL employees.

As per the Central government rules, similarly, Ex-Servicemen will have the benefit of age relaxation. And the fee for the exam is Rs 1000 for the candidates OC/OBC and Rs 500 for SC/ST candidates.

By the concerned registration authority only, the payment will have received through online mode, i.e., internet banking, credit card and debit card. On October 15, the online registration process for the exam will have closed.

How to Apply:

For the BSNL JAO Recruitment 2017, candidates who are interested in applying can follow the below-mentioned instructions.

 First, the people have to log in the official website of BSNL Recruitment Exams – externalbsnlexam.com.
 There will have a box with Apply Online, click on that which is in front of Direct Recruitment for the post “Junior Accounts Officer” in BSNL from open market through online competitive examinations 2017.
 The candidates have to need to click on Click here for new Registration that appears on the new web page.
 Here, the candidate has to enter the details.
After filling candidate has clicked on Submit.
Complete the application process by paying the fee.
Confirmation will get for you and take a print out for further reference.



భారత సంచార నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) 996 జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ (జేఏఓ) పోస్టుల ప్రకటన ఇటీవల విడుదలయింది. ఇది కామర్స్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌లకూ; సీఏ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎస్‌లను పూర్తిచేసినవారికీ సువర్ణావకాశమని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పరీక్షలను ఆంగ్ల మాధ్యమంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష తీరుతెన్నులూ, విజయానికి వేసుకునే ప్రణాళికల గురించి తెలుసుకుందాం!

ఆకర్షణీయమైన వేతనం, జాతీయస్థాయిలో పనిచేసే అవకాశం, ప్రభుత్వరంగ కంపెనీని మంచిస్థాయికి తీసుకువెళ్ళడంలో తమవంతు పాత్ర పోషించే అవకాశం మొదలైనవి జేఏఓ ఉద్యోగం సాధించడానికి ప్రోత్సాహకాలు. ఈ ఉద్యోగ స్వభావం సంస్థ లావాదేవీలనూ, సరైన లెక్కలనూ రాయటం. అందుకని దీనికి పోటీపడే అభ్యర్థులకు అకౌంటింగ్‌కు సంబంధించిన అన్ని భావనలూ, సూత్రాలపై అవగాహన అవసరమవుతుంది.
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, దరఖాస్తు సమర్పించే ప్రక్రియ మొదలైంది. అక్టోబరు 15 వరకూ కొనసాగుతుంది. జేఏఓ పరీక్షను ఆన్‌లైన్‌లో నవంబరు 5 నుంచి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సిలబస్‌, సన్నద్ధతలో పాటించవలసిన మెలకువలను పరిశీలిద్దాం!
అర్హతలు: 
బీఎస్‌ఎన్‌ఎల్‌ జేఏఓ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు ఎంకాం/సీఏ /ఐసీడబ్ల్యూఏఐ/ సీఎస్‌లలో ఏదో ఒకటి దేశంలో గుర్తింపు పొందిన యూనివర్శిటీలు/ సంస్థల నుంచి 1 జనవరి 2017 నాటికి అర్హత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 జనవరి 2017 నాటికి ఓసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. గరిష్ఠ వయః పరిమితి ఓబీసీ వారికి 33 సం॥; ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 35 సం॥. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు 5 సం॥ సడలింపు ఇచ్చారు. అంటే వారికి 35 సం॥ లోపు ఉండాలి. వికలాంగులకు 10 సం॥ పైబడి సడలింపు ఇచ్చారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: 
జేఏఓ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు బీఎస్‌ఎన్‌ఎల్‌ పోర్టల్‌ అయినwww.externalexam.bsnl.-co.in కు లాగిన్‌ అయి ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ 11 సెప్టెంబర్‌ 2017 న మొదలైంది. ఇది 15 అక్టోబర్‌ 2017 వరకూ కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకునేటపుడు అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. 
* ముందుగా వారు ఏ సర్కిల్‌ నుంచి పరీక్ష రాయదలచుకున్నారో నిర్ణయించుకోవాలి. 
* సర్కిల్‌ను ఎంపిక చేసుకునేముందు ఆ సర్కిల్‌లో కేటగిరీల వారీగా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయనేది నిర్ధారించుకోవాలి. 
* అభ్యర్థి ఎంపిక చేసుకున్న సర్కిల్‌లోని పోస్టుల సంఖ్య, కటాఫ్‌ ఆధారంగా ఉద్యోగం అభించే అవకాశం ఉంటుంది. 
* అభ్యర్థి ఒక సర్కిల్‌ను ఎంపిక చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక మార్చుకోవడానికి అవకాశం ఉండదు.
బీఎస్‌ఎన్‌ఎల్‌కు దేశవ్యాప్తంగా మొత్తం 28 సర్కిళ్ళు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం 996 జేఏఓ పోస్టులు. వీటిలో అత్యధికంగా 135 పోస్టులు మహారాష్ట్ర సర్కిల్‌లో ఉండగా, 72 పోస్టులు ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో, 71 పోస్టులు గుజరాత్‌ సర్కిల్‌లో ఉన్నాయి. అయితే తెలంగాణా సర్కిల్‌లో కేవలం 19 పోస్టులే ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు తాము పనిచేయడానికి సంసిద్ధంగా ఉండేదీ, ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉండేదీ అయిన సర్కిల్‌ను ఎంపిక చేసుకోవడం శ్రేయస్కరం. (వివిధ సర్కిల్‌లో పోస్టుల సంఖ్య కోసం నోటిఫికేషన్‌ చూడండి.)
ఫీజు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేటప్పుడు నిర్ణీత ఫీజును చెల్లించాలి. ఇది ఓసీ, ఓబీసీ అభ్యర్థులకు రూ॥ 1000 కాగా, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ॥ 500గా ఉంది. ఈ ఫీజును నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు సమయం ఉన్నప్పటికీ చివరలో తలెత్తే సాంకేతిక సమస్యలను అదిగమించడానికి అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం చాలా మంచిది.

Syllabus 
బీఎస్‌ఎన్‌ఎల్‌ జేఏఓ ఎంపికకు సంబంధించిన పరీక్షకు రెండు పేపర్లను నిర్దేశించారు. అభ్యర్థులు పరీక్షలను ఆంగ్ల మాధ్యమంలో నిర్ణీత పరీక్ష కేంద్రాల నుంచి రాయవలసి ఉంటుంది. మొదటి పేపరుకు జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌/అవేర్‌నెస్‌నూ, రెండో పేపరుకు కామర్స్‌ నుంచి ఫైనాన్షియల్‌ అండ్‌ కమర్షియల్‌ అకౌంట్స్‌ను నిర్దేశించారు. వీటి సిలబస్‌, సన్నద్ధమయ్యే విధానం ఎలా ఉండాలో చూద్దాం.

1) జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌/ అవేర్‌నెస్‌: 
ఈ పేపర్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో జనరల్‌ ఇంగ్లిషు నుంచి 100 మార్కులకు ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో కానీ, షార్ట్‌ ఆన్సర్‌ రూపంలో కానీ ఉండవచ్చు. అభ్యర్థి ఆంగ్ల ప్రావీణ్యాన్ని పరీక్షించడానికి వివిధ అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు. ముఖ్యంగా కాంప్రహెన్షన్‌ ఆఫ్‌ ప్యాసేజ్‌, గ్రామర్‌లోని వివిధ అంశాలు, ఇంగ్లిష్‌ యూసేజ్‌, ఒకాబులరీ మొదలైనవాటిని నిర్దేశించారు. ప్రామాణిక ఇంగ్లిష్‌ పుస్తకాలను తీసుకొని గ్రామర్‌, ఒకాబులరీలపై పట్టు సాధించాలి. వివిధ అంశాలను డిగ్రీ, పీజీ స్థాయిలో చదవాలి. మోడల్‌ పేపర్‌లను సాధన చేయాలి.
రెండో విభాగంలో జనరల్‌ ఆప్టిట్యూడ్‌/అవేర్‌నెస్‌ ప్రశ్నలను 50 మార్కులకు ఇస్తారు. దీనిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కరెంట్‌ అఫైర్స్‌ ఇస్తారు. అభ్యర్థులు పరీక్షకు ముందు 6- 8 నెలల ముందు నుంచీ కరెంట్‌ అఫైర్స్‌ చదవాలి. ప్రతిరోజూ దినపత్రిక చదువుతూ ముఖ్యమైన అంశాలను నోట్‌ చేసుకుని చదవాలి. వీటితో పాటు ఇండియన్‌ పాలిటీ, ఇండియన్‌ ఎకానమీ, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్‌ మొదలైనవాటిని నిర్దేశించారు. వీటికి సంబంధించిన మార్కెట్‌లో అందుబాటులో ఉండే ప్రామాణిక పుస్తకాలను చదవాలి. ప్రస్తుతం ఇండియన్‌ ఎకానమీలో ప్రధానంగా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ మొదలైన సంస్కరణలను లోతుగా చదవాలి. ఉద్యోగ విజయంలో మొదటి పేపర్‌ కూడా ప్రముఖ పాత్ర వహిస్తుందని అభ్యర్థులు గుర్తించాలి.

2) ఫైనాన్షియల్‌ అండ్‌ కమర్షియల్‌ అకౌంట్స్‌: 
దీనిలో కామర్స్‌ నుంచి దాదాపు 6 అంశాలను చేర్చారు. మొత్తం 150 ప్రశ్నలు. ఒక్కొక్కటి 2 మార్కుల చొప్పున 300 మార్కులకు నిర్వహిస్తారు. అంటే ఒక్కొక్క సబ్జెక్టు నుంచి దాదాపు 25 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సబ్జెక్టునూ ప్ర¾ణాళికాబద్ధంగా, పూర్తి స్థాయిలో చదవాలి. సంబంధిత సిలబస్‌ను చూద్దాం..
అడ్వాన్స్‌డ్‌ అకౌంటింగ్‌: దీనిలో ముఖ్యంగా కంపెనీ అకౌంట్స్‌ పరిచయం- వాటాలు, డిబెంచర్స్‌, కంపెనీ ఫైనల్‌ అకౌంట్స్‌, ఫండ్స్‌ ఫ్లో అండ్‌ క్యాష్‌ ఫ్లో స్టేట్‌మెంట్స్‌ చేర్చారు. అభ్యర్థులు దీనిలో కంపెనీ ముగింపు లెక్కలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, ఇటీవల వచ్చిన ప్రధాన మార్పులు, 2013 కంపెనీల చట్టంలోని ముఖ్యమైన అంశాలను లోతుగా చదవాలి. ప్రాబ్లమ్స్‌ను సాధన చేస్తూ చదవాలి.

ఆడిటింగ్‌: ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర వహించే సబ్జెక్టుల్లో ఆడిటింగ్‌ ఒకటి. దీనిలో ఆడిటింగ్‌ నేచర్‌, ఆబ్జెక్టివ్స్‌, బేసిక్‌ ప్రిన్సిపుల్స్‌, ఆడిటింగ్‌ టెక్నిక్స్‌, ఫిజికల్‌ వెరిఫికేష¯, ఎగ్జామినేషన్‌ ఆఫ్‌ డాక్యుమెంట్స్‌, వోచింగ్‌, డైరెక్ట్‌ కన్ఫర్మేషన్‌, అనలిటికల్‌ రివ్యూ, ఆడిట్‌ ప్లానింగ్‌, ఆడిట్‌ ప్రోగ్రామ్స్‌, వర్కింగ్‌ పేపర్స్‌, ఆడిట్‌ ప్రాసెస్‌, వాల్యుయేషన్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ కంట్రోల్‌, ఆడిట్‌ టైప్స్‌ తదితరాలను నిర్దేశించారు. అభ్యర్థులు ఈ సబ్జెక్టులో ముఖ్యమైన భావనలూ, వివిధ సెక్షన్లూ, సం॥రాలను, కనిష్ఠ-గరిష్ఠ సంఖ్య, ఆడిటింగ్‌ స్టాండర్డ్స్‌ను విశ్లేషిస్తూ చదవాలి. ఈ మధ్యకాలంలో సంభవించిన మార్పులను గమనించాలి.
ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌- యాన్‌ ఓవర్‌వ్యూ: దీనిలో ముఖ్యంగా నిర్దేశించిన అంశాలు- గోల్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, కీ ఆక్టివిటీస్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, రిలేషన్‌షిప్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ టు అకౌంటింగ్‌ అండ్‌ ఆడిట్‌, ఫైనాన్స్‌ ఫంక్షన్స్‌ మొదలైనవి. దీనిలో అభ్యర్థులు వివిధ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ భావనలు, లక్షణాలు, ప్రయోజనాలు, పరిమితులను విశ్లేషిస్తూ చదవాలి. కీలక పాయింట్లను నోట్‌ చేసుకోవాలి.

ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌: జేఏఓ సాధించడంలో అత్యంత కీలకపాత్ర వహించే సబ్జెక్టు ఇది. దీనిలో అకౌంటింగ్‌కు సంబంధించిన ప్రాథమిక భావనలు, బ్యాలన్స్‌షీట్‌, ప్రాఫిట్‌ - లాస్‌ అకౌంట్‌, సోర్సెస్‌ అండ్‌ యూజెస్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌, అనాలిసిస్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ పెర్‌ఫార్మెన్స్‌, ఫైనాన్షియల్‌ రేషియోస్‌ (నిష్పత్తులు), అప్లికేషన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అనాలిసిస్‌, ప్రాబ్లమ్స్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌ అండ్‌ అనాలిసిస్‌; బ్రేక్‌ ఈవెన్‌ అనాలిసిస్‌, లివరేజేస్‌ మొదలైనవి చేర్చారు. అభ్యర్థులు ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌ తయారుచేయడంలో ముఖ్యమైన అంశాలూ, సర్దుబాటు అంశాలు, నిష్పత్తులు, బ్రేక్‌ ఈవెన్‌ అనాలిసిస్‌, లివరేజెస్‌కు సంబంధించిన వివిధ సూత్రాలను చదవాలి. దాంతో పాటు ప్రతి పద్ధతిలో ప్రాబ్లమ్స్‌ను సాధన చేయాలి. పరీక్షలో దీని నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్‌ అడిగే అవకాశం ఉంది.
ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌: ఈ సబ్జెక్టులో క్యాపిటల్‌ బడ్జెటింగ్‌, లాంగ్‌ టర్మ్‌ ఫైనాన్షియల్‌, వర్కింగ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌, మెమొరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, అండ్‌ కంట్రోల్‌లను నిర్దేశించారు. అభ్యర్థులు దీనిలో ప్రతి పద్ధతికి సంబంధించిన సూత్రాలను చదువుతూ ఒకటి లేదా రెండు ప్రాబ్లమ్స్‌ను సాధన చేయాలి.

బేర్‌ యాక్ట్స్‌: జేఏఓకు సంబంధించిన సిలబస్‌లో ఇది కూడా ముఖ్యమైనది. దీనిలో ముఖ్యంగా కంపెనీల చట్టం 1956 (సవరణలతో), కాంట్రాక్టు చట్టం, భాగస్వామ్య చట్టం, గ్రాట్యుటీ పేమెంట్‌ చట్టం, కన్‌స్యూమర్‌ ప్రొటెక్షన్‌చట్టాలను చేర్చారు. అభ్యర్థులు వివిధ చట్టాలపై ఎంత పట్టు సాధిస్తే అన్ని మార్కులు స్కోరు చేయవచ్చు. గమనించవలసిన ముఖ్యమైన అంశం- కంపెనీల చట్టం 1956 తోపాటు ఇటీవల రూపొందించిన కంపెనీల చట్టం 2013నూ, వివిధ సవరణలనూ లోతుగా చదవాలి. ముఖ్యమైన ఇతర చట్టాలు, వాటిని రూపొందించిన సం॥రాలు, ముఖ్యమైన సెక్షన్లు, వివిధ భావనలు, వాటిలో సవరణలను విశ్లేషిస్తూ చదివితే మంచి మార్కులు పొందవచ్చు.

వీటితోపాటు అభ్యర్థులకు కామర్స్‌ సంబంధిత ఇతర సబ్జెక్టులు కాస్ట్‌ అకౌంటింగ్‌, టాక్సేషన్‌, ఇతర సబ్జెక్టులపై కొంత అవగాహన ఉండాలి. ఇంకా ముగింపు లెక్కలకు సంబంధించిన అంశాలపై లోతుగా చదువుతూ పూర్తి అవగాహన పొందాలి. వివిధ చట్టాలు, సం॥, సెక్షన్లు, కనిష్ఠ-గరిష్ఠ సంఖ్య, స్టాండర్డ్స్‌, ఇటీవల వచ్చిన మార్పులను చదువుతూ ముఖ్యమైనవి నోట్‌ చేసుకోవాలి. అభ్యర్థులు ముఖ్యంగా ప్రాబ్లమ్స్‌ బాగా అభ్యాసం చేయాలి. గతంలోని జేఏఓ పేపర్లను, వీలైనన్ని మోడ¿ల్‌ పేపర్లనూ సాధన చేయడంలోనే విజయం దాగివుంటుందని అభ్యర్థులు గమనించాలి. ప్రతిరోజూ 10- 12 గంటల వరకు ప్రణాళికాబద్ధంగా చదువుతుండాలి. మొత్తం సిలబస్‌ను కనీసం మూడు పర్యాయాలు సమగ్రంగా పునశ్చరణ (రివిజన్‌) చేసినట్లయితే కచ్చితంగా విజయం వర్తిస్తుంది. స్వామి వివేకానంద చెప్పినట్లు ‘నిరŒంతరం వెలిగే సూర్యుణ్ని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించేవారిని చూసి ఓటమి భయపడుతుంది’. కాబట్టి అభ్యర్థులు నిరంతరం శ్రమించి విజయాన్ని పొందాలి.
చదవాల్సిన పుస్తకాలు 

1. For English Grammer & Vocabulary -Wren & Martin (Revised Edition) 
Raymond Murphy 
2. Advanced Accounting- Jain & Narang & S.N. Maheswari 
3. Auditing- R.G.Saxena & Kamal Gupta 
4. Financial Management- An overview- I.M. Pondey & Prasanna Chandra 
5. Financial Statements- Jain & Narang, R.L Guptha 
6. Financial Management in Public sector Enterprises- Sarma & Shashi.k .Gupta & Prasanna Chandra 
7. Bare Acts (Business laws)- Kapoor ND, S.N. Maheshwari
Source Taken From @Internet Sites







No comments:

Post a Comment

UK 2+2 extension visa.. Now it's officially announced

*Indian students thrilled with UK PM Boris Johnson reinstating post-study work visa. *UK brings back 2-year post-study work visa. UK'...