Monday, 31 July 2017

Central Government Approves 2 Electronic Manufacturing Clusters For AP,TS - LATEST UPDATES FROM TELUGU STATES









 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు సెక్రటరీ అజయ్‌కుమార్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఏపీఐఐసీ 500 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన క్లస్టర్‌కు అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.340 కోట్లు.

 అలాగే తెలంగాణ ప్రభుత్వం రెండు క్లస్టర్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిలో హైదరాబాద్‌ సమీపంలో రావిర్యాల వద్ద టీఎస్‌ఐఐసీ 600 ఎకరాల్లో నెల కొల్పనున్న ప్రాజెక్టుకు క్లియరెన్సు వచ్చింది. ప్రాజెక్టు వ్యయం రూ.667 కోట్లు. ఇందులో కేంద్రం రూ.240 కోట్లను గ్రాంటు రూపంలో సమకూర్చనుంది. శంషాబాద్‌ సమీపంలోని మహేశ్వరం వద్ద మహేశ్వరం సైన్స్‌ పార్క్‌ ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు పంపింది.


దీనికి అనుమతి రావాల్సి ఉంది. అజయ్‌ కుమార్‌ ట్వీట్‌కు స్పందిస్తూ శుభవార్త తెలిపినందుకు కృతజ్ఞతలు అంటూ తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావు ట్వీట్‌ చేశారు. కాగా, ఎలక్ట్రానిక్స్‌ దిగుమతుల భారం తగ్గించడానికి దేశీయంగా వీటి తయారీ ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే క్లస్టర్లను నెలకొల్పుతోంది. కేంద్రం నిధులతో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తారు.

The Ministry of Electronics and Information and Technology has given approval to set up two electronics manufacturing clusters in Telangana and Andhra Pradesh.

Ajay Kumar, Additional Secretary, Ministry of Electronics and IT tweeted that the Centre has given approval for 500 acre Electronic manufacturing Cluster to be set up by APIIC in Chitoor in Andhra Pradesh and the project cost will be Rs 340 crore.

"Approval by @GoI_MeitY for 600 acre Electronic Mfg Cluster to be set up by TSIIC in Hyderabad. Project Cost Rs 667 cr.@TelanganaCMO @KTRTRS," Kumar said in another tweet.

Reacting to it, Telangana IT and Industries Minister K T Rama Rao tweeted "thanks Ajay Ji (Ajay Kumar) for the good news".

No comments:

Post a Comment

UK 2+2 extension visa.. Now it's officially announced

*Indian students thrilled with UK PM Boris Johnson reinstating post-study work visa. *UK brings back 2-year post-study work visa. UK'...